యాంకర్ సుమ ఫన్నీ డ్యాన్స్.. వీడియో వైరల్

-

బుల్లితెర యాంకర్ సుమ పేరు తెలియని వారుండరు. పిల్లాడి నుంచి ముసలివాళ్ల వరకు అందరికీ సుమ అక్కే. బుల్లితెరపై సుమ కనిపిస్తే చాలు ఇక సందడే సందడి. ఈ యాంకరమ్మను అంతా తమ ఇంట్లో మనిషిలా భావిస్తుంటారు. సామాన్యులతో పాటు స్టార్ హీరోల వరకు సుమ ఫ్యాన్సే. ఇక టీవీలోనే కాదు సుమ సోషల్ మీడియాలోనూ పాపులరే. తరచూ ఏదో ఒక ఫన్నీ రీల్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక ట్రెండ్కు తగ్గట్టుగా వీడియోలు చేయడం సుమకే సాధ్యం. తాజాగా సుమ ఓ ఫన్నీ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభుదేవా లేటెస్ట్ రీల్ వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. ఆ రీల్‌ను రీ క్రియేట్ చేయాలని సుమ అండ్ టీమ్ ట్రై చేసింది. అయితే వీరంతా నాన్ సింక్లో డ్యాన్స్ చేసి తెగ నవ్వించేశారు. ఆ వీడియోకు అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ 2.ఓ అన్నట్టుగా క్యాప్షన్ జోడించిన సుమ ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version