జనసేన పార్టీ నాయకులు, తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మికి బిగ్ రిలీఫ్ దక్కింది. జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మికి బెయిల్ మంజూరు అయింది. కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఫిర్యాదు చేయగానే, ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు తెరపైకి చెక్ బౌన్స్ కేసు వచ్చింది.
ఈ కేసులో లక్ష్మి అరెస్ట్ అయ్యారు. పాత చెక్ బౌన్స్ కేసులో లక్ష్మిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు..ఏపీకి వచ్చి మరీ.. తీసుకెల్లారు. అయితే… తాజాగా జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మికి బెయిల్ మంజూరు అయింది. ఇక అటు ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా.. ఇప్పుడు మీ జనసేన ఇంఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది నాకు అండగా నిలబడవా అన్న అంటూ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.