IND Vs ENG : భారత్ భారీ స్కోర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..?

-

అహ్మదాబాద్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే మ్యాచ్ లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాటల్లో కలిపి ఇంగ్లండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లండ్ పై నాలుగువేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్ గా నిలిచాడు. కోహ్లీ ఇంగ్లండ్ పై ఇప్పటివరకు ఎనిమిది సెంచరీలు చేయడంతో పాటు 23 హాప్ సెంచరీలు కూడా చేశాడు. ఈ మ్యాచ్ లో విరాట్ 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

మిగతా బ్యాటర్లు కూడా చివరి వన్డేలో దుమ్మురేపారు. శుభ్ మన్ గిల్  112తో అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 78, విరాట్ కోహ్లీ 52, రాహుల్ 40 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది భారత జట్టు. గత మ్యాచ్ లో సెంచరీతో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ కేవలం ఒకే ఒక్క పరుగుతో ఔట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లతో సత్తా చాటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version