తెలుగు టాప్ యాంకర్స్‌లో వర్షిణి సౌందర రాజన్ ఒకరు. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షిణి త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సంగతులు..
వర్షిణిది.. హైదరాబాద్‌లో సెటిల్ అయిన తమిళ కుటుంబం. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. సినిమాల మీద ఆసక్తితో మోడలింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసింది. శంభో శివ శంభో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత చందమామ కథలు, లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్, శ్రీరామ రక్ష, పెళ్లిగోల, పెళ్లిగోల 2, నన్ను దోచుకుందువటే, పెళ్లి గోల 3 వంటి సినిమాలు వెబ్ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే యాంకరింగ్ చేస్తూ హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.
ఇక ఢీ షో నుండి బయటకు వచ్చిన ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ షో లో చేస్తుంది. తన ఎంట్రీ డాన్సులతో అందరి దృష్టినీ తనవైపు లాక్కుంటుంది. ట్రెడిషనల్, గ్లామర్ లుక్ లతో కూడా బాగా ఆకట్టుకుంటుంది. వెండి తెరను బుల్లితెర ని ఏలేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన వర్షిణి ఎటూ కాకుండా అటు బుల్లితెరకు పరిమితం కాకుండా ఇటు వెండి తెర పై అవకాశం దక్కించుకోకుండా సింగిల్ గా మిగిలిపోతుంది. ఈ క్రమంలోనే లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉండాల్సి వస్తుందేమో అనుకొని పెళ్లి చేసుకోవడానికి సెటిలైపోవడానికి సిద్ధపడిందని సమాచారం.
యాంకర్ వర్షిణి పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు తన సొంత బావనే అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి తనకు వాళ్ళ బావ అంటే ఎంతో ఇష్టమని.. వాళ్ళ బావకి కూడా తనంటే ఇష్టమని ఈ క్రమంలోనే ఇంట్లోనే పెద్దలు వారిద్దరిని ఒకటి చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారని.. కానీ వర్షిని సినిమాల అవకాశాలు వస్తాయి అంటూ వెయిట్ చేసిందని అయితే ఇన్నాళ్లు వేచి చూసినా.. సినిమా అవకాశాలు రాకపోవడంతో చివరకు తన బావతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.
అతడు కూడా ఓ సాఫ్ల్ వేర్ ఉద్యోగి. ఒక్కడే కొడుకు అని.. కోటిశ్వరుడు అని తెలుస్తుంది. తన బావతో వర్షిణి ఎంగేజ్మెంట్ కూడా ఈనెలాఖారు వరకు ఉండనుందని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. మొత్తం మీద వర్షిణి కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందని సమాచారం.