వరకట్న వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఆరు నెలల కిందట గోవాలో దేవిక (35), సతీష్ వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం రాయదుర్గం పీఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.ఇరువురు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అయితే, భర్త తరచూ వరకట్నం కోసం వేధిస్తుండటంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కాగా, సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త సతీష్ గుర్తించి పోలీసులకు, దేవిక కుటుంబీలకు సమాచారమిచ్చాడు.వరకట్న వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.