ఇంట్రెస్టింగ్​గా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ట్రైలర్​

-

ఇటీవల టాలీవుడ్​లో చిన్న సినిమాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలో నటీనటులు.. డైరెక్టర్లతో పనిలేదంటున్నారు ప్రేక్షకులు. అలా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న మరో సినిమా అన్నపూర్ణ ఫొటో స్టూడియే. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు, లావణ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్​, ప్రోమోలు, సాంగ్స్​ ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్. “నేడే చూడండి మీ అభిమాన థియేటర్​లో అన్నపూర్ణ ఫొటో స్టూడియో. మనస్సుకు హత్తుకునే ప్రేమ కథ, గిలిగింతలు పెట్టే హాస్యం, ఉర్రూతలెక్కించే అందమైన పాటలు, ఉత్కంఠ భరితంగా సాగే కథనం, పోరాటలు, ఉహకందని మలుపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ఉన్నాయి” అంటూ ప్రచార చిత్రంలో అన్ని సన్నివేశాలను చాలా బాగా చూపించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని నటీనటులు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ కూడా ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version