ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న లాలిత్య అనే బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది. విషయం తెలియడంతో బాలిక పేరెంట్స్ అక్కడకు చేరుకున్నారు.
తమ కూతురి మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని బాధిత పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కూతురు చనిపోయిందని ఆవేదనలో ఉన్న బాలిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముందుగా హాస్టల్ వార్డెన్‌ను అరెస్టు చేసి విచారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.