యూట్యూబర్ హర్ష సాయికి ముందస్తు బెయిల్

-

యూట్యూబ్ వీడియోలు చూసే చాలా మంది వీక్షకులకు హర్షసాయి సుపరిచితుడే. హీరో రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉన్న హర్షసాయి ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు తన వీడియోల్లో జూదానికి సంబంధించిన ప్రమోషన్స్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారితే.. ఇప్పుడు తనపై బిగ్ బాస్ కార్యక్రమంతో వెలుగులోకి వచ్చిన ఓ నటి లైంగిక ఆరోపణలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ నటి ఫిర్యాదు మేరకు.. సెప్టెంబర్ 24న పోలీసులు కేసు నమోదు చేయగా.. అప్పటి నుంచి హర్ష సాయి పరారీలోనే ఉండటం గమనార్హం. పోలీసులు హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version