సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్ చేశారు. తాాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉండాలి. ఈ పథకాలు అమలు చేయలేం అని చెప్పాలన్నారు.
అలాగే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయలేకపోతే ప్రజలను క్షమించమని అడగండి. ఆలస్యం అయినా పర్వాలేదు కానీ కచ్చితంగా అమలు చేయాలని కోరారు. లేదంటే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల ట్రాప్ లో కాంగ్రెస్ కూడా పడుతుందని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ ఎలా అయినా బ్రతకాలి అని చూస్తోందన్నారు కూనం నేని సాంబశివ రావు.