నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలోను నటించింది. తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ చిన్నది మాట్లాడుతూ రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వదులుకున్నానని తనపై అనేక రకాల తప్పుడు ప్రచారాలు జరిగినట్లుగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు.

రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేసిందనే ప్రచారంతో ఆరు నెలల పాటు తనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని చెప్పింది. 6 నెలల పాటు పూర్తిగా ఖాళీగా ఉన్నానని ఈ బ్యూటీ చెప్పింది. రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించమని సుకుమార్ నన్ను అడిగారు. నేను కూడా ఓకే చెప్పాను. ఆ తర్వాత వారు హీరోయిన్ సమంతను తీసుకున్నారు. నేను ఆ సినిమాలో నటించనని చెప్పలేదు. తప్పుడు ప్రచారం వల్ల ఆరు నెలలు ఇంటికే పరిమితమయ్యానంటూ నటి అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసుకుని ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, రంగస్థలం సినిమాలో సమంత నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమానూ తన ఖాతాలో వేసుకుంది.