Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్.. అనుప‌మ అరాచకం

-

Kishkindhapuri Trailer: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్… కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను.. ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే కిష్కిందపురి సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఉన్నారు.

Kishkindhapuri Trailer, Bellamkonda Sreenivas
Kishkindhapuri Trailer, Bellamkonda Sreenivas

ఈ సినిమా పూర్తిగా హారర్ అలాగే మిస్టరీ కథతో తెరకెక్కిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా… ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో.. అనుపమ యాక్టింగ్ అరాచకంగా ఉంది. ఆ రాక్షస శక్తిని ఎవరు ఆపలేరు అంటూ డైలాగులు కూడా అదిరిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news