Anupama Parameswaran : సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌ !

-

Anupama Parameswaran : మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తాజాగా అనుపమ పరమేశ్వరన్​ తన అందంతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తన నటనతో, అందంతో, చలాకీతనంతో యువతను ఆకట్టుకునే ఈమె ఒక్క ప్రేక్షకులనే కాదు సెట్ లో అందరితో కూడా కలగలసిపోయి చాలా సరదాగా కనిపిస్తూ ఉంటుంది.

Anupama Parameswaran pic viral

అందుకే ఈమె అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. అంతే కాదు కాస్త సమయం దొరికితే చాలు తన అన్నతో గొడవ పడే సన్నివేశాలను కూడా వీడియోల రూపంలో పంచుకుంటూ ఉంటుంది. ఇక అభిమానులతో కూడా లైవ్ చాట్ చేస్తూ మరింత దగ్గర అవుతోందని చెప్పవచ్చు.

కాగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం డీజే 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అనుపమా ఓ ఫోటోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోలో తన మెడలో తాలిబొట్టు ఉన్నట్లు స్పష్టం చూపించింది. దీంతో మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకుందా అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అంతేకాదు.. అనుపమా భర్త ఎవరు అంటూ కూడా అడుగుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version