దర్శకుడు రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చారు ఏపీ పోలీసులు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం..ఫిర్యాదు చేశారు.

ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి.. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం..ఫిర్యాదు చేశారు. దీంతో దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆర్జీవీ పై ఫిర్యాదులు నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు సర్వ్ చేశారు ఎస్సై శివరామయ్య. మరి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇచ్చిన నోటీసుల ఎపిసోడ్ తర్వాత.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా..అనేది కూడా పరిశీలిస్తారు.