ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వారియర్స్ల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని, తనపై ఏ కేసు లేకుండా చేసేందుకు రూ.5 లక్షలు లంచం గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు.
అంత డబ్బు తన వద్ద లేదని ఇక తనకి చావే శరణ్యం అని భావించి, రైలు పట్టాలపై తలపెట్టి చనిపోతున్నానని మదార్ వలి అనే యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.