చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. అమరన్ సినిమా హాల్ పై పెట్రోల్ బాంబు జరిగింది. అమరన్ సినిమా హాల్ పై పెట్రోల్ బాంబు విసిరారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ప్రస్తుతం ధియేటర్ లో అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది థియేటర్ యాజమాన్యం.
ఈ తరుణంలోనే… ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో పెట్రోల్ బాంబు విసిరిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అమరన్ సినిమా హాల్ పై బాంబులు విసిరే దృశ్యాలు..సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.