కలెక్షన్లలో దూసుకెళ్తున్న అవతార్ 2.. రెండ్రోజుల్లో ఎంతంటే..?

-

అవతార్ 2 వరల్డ్ సినిమా తెరపై విజువల్ వండర్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.41 కోట్లు వసూల్ చేసింది. ఈ మూవీ రెండో రోజు కలెక్షన్ దాదాపు రూ.45 కోట్లు దాటినట్లు సమాచారం. గ్రాస్ కలెక్షన్స్ విషయానికొస్తే ఈ చిత్రం రెండ్రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దిమ్మతిరిగే విధంగా రూ.1700 కోట్ల మార్క్ దాటినట్లు సినీ ట్రేడ్ వర్గాల సమాచారం.

Powered By
Video Player is loading.

అవతార్‌ 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వీకెండ్ లో రూ.130 నుంచి రూ.140 కోట్ల బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి అంతటా ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇండియాలో ఈ సినిమా ఇంగ్లిష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version