ఓటీటీలోకి బేబీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల కంటే చిన్న హీరోల చిత్రాలే ఎక్కువగా సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఎప్పుడూ హీరోయిజం.. ఫైట్లు.. రొమాన్స్.. చూసి ముఖం కొట్టేసిన ప్రేక్షకులను.. కొంతమంది కుర్ర దర్శకులు.. కొత్త డైరెక్టర్లు.. రియాల్టీకి దగ్గరగా ఉండే కథలతో మెప్పిస్తున్నారు. అలా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీ సినిమా.

సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 14న థియేటర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఓవైపు మౌత్ టాక్.. మరోవైపు పాటలు.. ఇంకో వైపు సోషల్ మీడియాలో ట్రోల్స్.. మీమ్స్.. ఈ సినిమాకు బాగా ప్రచారం చేసిపెట్టాయి. దాంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.

ముఖ్యంగా వైష్ణవి, ఆనంద్‌ దేవరకొండల నటన అందరినీ కట్టిపడేసింది. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద రూ.80కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక  ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా?  అని ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ‘బేబీ’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో స్ట్రీమింగ్‌ అవుతుందని టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version