గతంలో ఉన్న హెచ్ఎండీఏ పరిధిని తాజాగా తెలంగాణ ప్రభుత్వం విస్తరించింది. తాజాగా హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాలలోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.
కొత్తగా వీటిని చేర్చడం ద్వారా హెచ్ఎండీఏ పరిధిలోకి 3 వేల చ.కి. భూభాగం చేరింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు ఉన్నాయి. ప్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యూచర్ సిటీ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ప్యూచర్ సిటీ పరిధిలోకి రంగారెడ్డి జిల్లాలోని 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు విలీనం కానున్నాయి. FCADA పరిధిలోకి ఆమనగల్, కడ్తాల్, ఇబ్రాహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలు ఉన్నాయి.