బాల‌య్య 105 స్టిల్ ఏం చెపుతోంది… మ‌ళ్లీ అదే స్టోరీయా

-

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్నిక‌ల మూడ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఇప్ప‌టికే ఈ యేడాది ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు అయిన మ‌హానాయ‌కుడు, క‌థానాయ‌కుడు సినిమాల‌తో వ‌రుస‌గా రెండుసార్లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బాల‌య్య ప్ర‌స్తుతం కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ రూల‌ర్‌)లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సీ క‌ళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా కాంబోలోనే గ‌తంలో జై సింహా సినిమా వ‌చ్చి హిట్ అయ్యింది. 2018 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్ అయ్యింది. ఇక తాజా సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాల‌య్య మ‌ళ్లీ యాక్ష‌న్ మోడ్‌నే న‌మ్ముకున్న‌ట్టు తెలుస్తోంది. ఒళ్లంతా ప‌సుపు, కుంకుమ చ‌ల్లిన స్టిల్‌తో ర‌క్తం కారుతున్న క‌త్తితో సీరియ‌స్‌గా ఉంటాడు

Balakrishna 105th Movie first-look released

బ‌హుశా ఓ ఫైటింగ్‌కు సంబంధించిన స్టిల్‌గా క‌న‌ప‌డుతోంది. జై సింహా కూడా యాక్ష‌న్ సినిమా అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ద‌ర్శ‌కుడు కెస్‌.ర‌వికుమార్ మ‌ళ్లీ బాల‌య్య‌ను మాంచి క‌మర్షియ‌ల్‌, యాక్ష‌న్ క‌థ‌లోనే చూపించ‌నున్న‌ట్టు ఫ‌స్ట్ లుక్‌లోనే చెప్ప‌క‌నే చెప్పేశాడు. సంక్రాంతికి భారీ సినిమాలు పోటీలో ఉండ‌డంతో సంక్రాంతి సెంటిమెంట్‌కు భిన్నంగా బాలయ్య సినిమాను సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నారని తాజా సమాచారం.

Balakrishna 105th Movie first-look released

బాలయ్య 105వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నారట. డిసెంబ‌ర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version