బాలీవుడ్​లోకి బాలకృష్ణ.. ఫ్యాన్స్​కు పండగే ఇక

-

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా సక్సెస్​లో ఫుల్ ఖుష్ ఉన్నారు. మరోవైపు తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా భగవంత్ కేసరి మూవీ సక్సెస్ మీట్​ను హైదరాబాద్​లో నిర్వహించారు. ఈ ఈవెంట్​లో బాలయ్య తన ఫ్యాన్స్​కు అద్దిరిపోయే న్యూస్ చెప్పారు. అదేంటంటే..? త్వరలోనే ఆయన బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. బాలయ్య బాలీవుడ్ ఎంట్రీ అనగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

అయితే బాలకృష్ణ నేరుగా బాలీవుడ్ సినిమా చేయడం లేదు. భగవంత్ కేసరి మూవీ బాలీవుడ్​లో డబ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన పాత్రకు హిందీ డబ్బింగ్ తానే చెప్పుకున్నారట. బాలయ్య వాయిస్​లో హిందీ మాస్ డైలాగ్స్ అంటే ఇక థియేటర్లు బద్ధలవ్వాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్​ను చూడటానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ సక్సెస్ మీట్​లో బాలయ్య మాట్లాడుతూ.. తనకు తన తండ్రి ఎన్టీఆర్​కు ప్రయోగాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అందుకే తాను తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించారు. హిందీలో డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారని.. ఈ సినిమాతో హిందీపై తనకున్న పట్టును ప్రేక్షకులు చూస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news