నా ఫేవరెట్ హీరో మహేశ్ బాబు.. అన్స్టాపబుల్ షోలో బాలయ్య కామెంట్స్

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్ సీజన్ 3’ టాక్ షో మూడో ఎపిసోడ్లో సీనియర్ హీరోయిన్లు సుహాసిని, శ్రియా శరణ్, డైరెక్టర్లు హరీశ్ శంకర్, జయంత్ పరంజీ గెస్ట్లుగా వచ్చాడు. ఈ ఎపిసోడ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్లో పలు ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆ వీడియోలు కాస్త ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇందులో ఓ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. బాలయ్య వీడియోను మహేశ్ ఫ్యాన్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారనుకుంటున్నారా? ఎందుకో మీరే చూసేయండి మరి.

ఈ ఎపిసోడ్లో పాల్గొన్న గెస్ట్లతో బాలకృష్ణ సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు. హీరోయిన్ శ్రియాతో కలిసి బాలయ్య స్టెప్పులేశారు. ఈ ఎపిసోడ్లో గెస్టులతో ముచ్చటిస్తుండగా అవార్డుల ప్రస్తావన వచ్చింది. అప్పుడు బాలయ్య ‘నేను అవార్డును నా అభిమాన హీరో మహేశ్ బాబుకు ఇద్దాం అనుకుంటున్నా’ అని అన్నారు. అంతే ఈ వీడియో క్లిప్పును సూపర్స్టార్ ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు బాలయ్య వంటి హీరో అభిమాని అని చెప్పడంతో వారు తెగ ఖుష్ అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version