ముంబయి చేరుకున్న ఫ్రాన్స్‌లో నిర్బంధానికి గురైన విమానం

-

మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్న విమానం మూడు రోజుల నిర్బంధం అనంతరం భారత్‌కు చేరుకుంది. 303 మంది భారత్ ప్రయాణికులతో ఆ విమానం ముంబయికి వచ్చేసింది. వాట్రీ విమానాశ్రయంలో న్యాయవిచారణ ముగించుకున్న ప్రయాణికుల విమానం నేరుగా ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది.

ఈనెల 22న రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గురువారం ప్రయాణికులతో దుబాయి నుంచి నికరాగువాకు బయల్దేరింది. మార్గమధ్యలో ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో ఆగినపుడు విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫ్రాన్స్‌ అధికారులకు అనుమానం వచ్చి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అనంతరం మానవ అక్రమ రవాణా ఆరోపణలతో విమానాన్ని అధీనంలోకి తీసుకున్న ఫ్రాన్స్‌ ఎయిర్పోర్టులోనే దీనిపై విచారణ జరిపింది. అనంతరం మానవ అక్రమ రవాణాపై విచారణ చేపట్టిన నలుగురు న్యాయమూర్తుల బృందం కేసు విచారణలో లోపాలు ఉన్నాయంటూ విచారణ రద్దు చేశారు. విమానం బయల్దేరేందుకు అనుమతులు రావడంతో తాజాగా ప్లేన్ ముంబయి చేరుకుంది. ఫ్రాన్స్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు, విచారణ కోసం కొంతమంది అక్కడే ఉంటున్నట్లు లెజండ్‌ ఎయిర్‌లైన్స్‌ తరపు న్యాయవాది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version