మెగా ఫ్యామిలీ పై బాలకృష్ణ కామెంట్ వైరల్..!

-

తాజాగా బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య ఎదుట కూర్చుని ఎంతో సరదాగా మాట్లాడుతూ.. వ్యక్తిగత విషయాలతో పాటు సినీ, రాజకీయ ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. నందమూరి , మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.. ఎపిసోడ్లో బాలయ్య బాబు ఎన్నో విషయాలను పవన్ కళ్యాణ్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు.

అలాగే రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ కి ఉన్న అనుబంధం గురించి కూడా అడిగారు. అంతేకాదు రామ్ చరణ్ కి ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి మీ ఇద్దరికీ సంబంధించిన ఏదైనా సీక్రెట్ చెప్పమని బాలయ్య అడగ్గా.. అందుకు రామ్ చరణ్ కళ్యాణ్ బాబాయితో సింగపూర్ కి వెళ్లి అక్కడ ఆయనను చాలా ఇబ్బంది పెట్టాను అంటూ అసలు విషయం చెప్పారు.. దగ్గర అమ్మానాన్న ఎవరూ లేకపోవడంతో ఇష్టానుసారంగా పిజ్జా, బర్గర్ లాంటి ఫుడ్ తినేసానని.. దాంతో ఆరోగ్యం దెబ్బతిని విపరీతంగా వాంతులు చేసుకోవడంతో ఆవాంతులను , నన్ను బాబాయ్ తన చేతులతో క్లీన్ చేశారని పవన్ కళ్యాణ్ గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

అలాగే పవన్ కళ్యాణ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుందని రామ్ చరణ్ ని అడగగా.. “ఏమీ ఉండదండీ.. ఆయన లైఫ్ చాలా బోరింగ్ “అంటూ రాంచరణ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అనుబంధం చూసి మెగా ఫ్యామిలీ పై బాలకృష్ణ చాలా క్యూట్ ఫ్యామిలీ మీది అనేసారు. మొత్తానికి అయితే ఈ ఎపిసోడ్ బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version