మహా కుంభమేళాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మహా కుంభమేళాలో ఆర్మీ పడవ బోల్తా కొట్టింది. మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయించేందుకు 15 మంది భక్తుల్ని తీసుకెళ్లింది ఆర్మీ పడవ. అయితే..మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయించేందుకు 15 మంది భక్తుల్ని తీసుకు వెళుతున్న తరుణంలోనే… ఆర్మీ పడవ బోల్తా కొట్టింది.
మరో పడవ ఢీ కొట్టడం వల్లే.. అరెయిల్ ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే స్పందించి.. భక్తులను సురక్షితంగా కాపాడాయి SDRF, NDRF బృందాలు. ఢీకొట్టిన పడవలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతాబ్ పాండే ప్రకటించారు. ఇక ఈ సంఘటన పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మహా కుంభమేళాలో ఆర్మీ పడవ బోల్తా కొట్టిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.