పండగకు సొగ్గాడే చిన్ని నాయనా లాంటి హిట్ కొడతానని చిన బంగార్రాజు మీసం మెలేశాడు.ఆయనతో పాటు పెద్ద బంగార్రాజు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ఈ సినిమా ఆశించిన వసూళ్లయితే సాధించలేకపోయినా ప్రస్తుతానికి నిర్మాతలకు వచ్చిన కష్టం ఏమీ లేదు. ఓటీటీ, ఇతర రైట్స్ అన్నీకలుపుకుని సినిమాను బాగానే ఆదుకోనున్నాయి. ఏ మాటకు ఆ మాటకు ఈ సినిమాను మరింత బాగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్నా కూడా నాగ్ మరియు అతని బృందం ఎందుకనో దృష్టి సారించలేకపోయింది. సీనియర్ రైటర్ సత్యానంద్ అందించిన స్క్రీన్ ప్లే వర్కౌట్ కాలేదని తేలిపోయింది. స్క్రీన్ ప్లే బాగుంటే కొన్నయినా అన్ ప్రిడక్టబుల్ సీన్స్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్లేదని సమీక్షకులు అంటున్న మాట.
సినిమా బాగుంది కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా లేవు. విదేశాల్లో సినిమా ఓపెనింగ్స్ అయితే చాలా అంటే చాలా యావరేజ్ గానే ఉన్నాయి. అనుకున్నంత కలెక్షన్లు లేవు. నలభైవేల డాలర్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది మన బంగార్రాజు.పెట్టిన డబ్బులు వెనక్కు వచ్చేలానే కలెక్షన్లు ఉన్నా ఇవేవీ చెప్పుకోదగ్గ రేంజ్ ఉన్న కలెక్షన్లు కావు అని తేలిపోయింది. వరల్డ్ వైడ్ గ్రాస్ మొదటి రోజుకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న ఓ ప్రాథమిక సమాచారం అనుసారం 15 కోట్ల రూపాయలు అని తేలింది.
ఇక వీకెండ్ బాగుండడం,పండగ మానియా ఈ సోమ, మంగళవారాల్లో (తేదీలు : జనవరి17,18) కూడా ఉండడంతో సినిమా కలెక్షన్లు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ శ్రీకాకుళంలో మార్నింగ్ షో ఫుల్.. ఇక మిగతా ఆటలకూ అదే రేంజ్ టాక్ ఉండనుంది అని తెలుస్తోంది. ఇదేవిధంగా మిగతా ప్రాంతాలలోనూ బంగార్రాజు బిజినెస్ ఊపందుకోనుంది.ఇంకొంత ప్రమోషన్ చేయగలిగితే బంగార్రాజుకు మరికొన్ని డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.