భాను శ్రీ.. పదహారణాల తెలుగంధం ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ఎప్పటికప్పుడు కుర్రకారును సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో స్టార్ సెలబ్రిటీలకు కూడా ఫిదా అవుతూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మల్లెమాల సంస్థ నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకి కూడా అప్పుడప్పుడు హాజరవుతూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన వాయిస్ పైనే ఎక్కువగా పంచులు పడుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా తనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ను పోగొట్టకుండా చాలా చక్కగా నటిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా గ్లామర్ షో కి దూరంగా ఉండే భాను శ్రీ తన గార్జియస్ లుక్ తో .. నిండుదనంతో చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలలో కూడా నటించడానికి ప్రయత్నం చేస్తుంది. తనకు సంబంధించిన ఫోటోలతో నిత్యం సందడి చేస్తూ ఉంటుంది. యాంకర్ గా తనని తాను ప్రూవ్ చేసుకున్న భాను శ్రీ .. ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటుంది. యాంకర్ గానే తన కెరియర్ ను మరింత పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూపరులను బాగా ఆట్టుకుంటున్నాయి.
ఇకపోతే భాను శ్రీ అభిమానులతో కూడా అప్పుడప్పుడు ముచ్చటిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటుంది. ఇకపోతే ఎప్పుడు వివాహం చేసుకుంటుందని ఆమె అభిమానుల సైతం ఆసక్తిగా అడుగుతున్నారు. కానీ వివాహ బంధానికి దూరంగా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్ తో కుర్ర కారుకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా భాను శ్రీ షేర్ చేసిన ఫోటోలు , రీల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.