‘భోళా శంకర్‌’ మేనియా షురూ.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న మెగా కటౌట్‌

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. తమన్నా భాటియా హీరోయిన్ గా.. కీర్తి సురేశ్ కీలక పాత్రలో నటించిన సినిమా భోళా శంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది మెగా ఫ్యాన్స్ సంబురాలు మిన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ భారీ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సూర్యాపేట – విజయవాడ  జాతీయ రహదారిపై ఉన్న రాజు గారి తోట వద్ద 126 అడుగుల భారీ కటౌట్‌ను మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ‘మెగా సెలబ్రేషన్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది’ అంటూ నెటిజన్లతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో ఇంత పెద్ద కటౌట్‌ ఇప్పటి వరకు ఏ హీరోకు ఏర్పాటు చేయలేదని అంటున్నారు. ఈ చిత్రంలో మరోసారి వింటేజ్‌ చిరుని చూడడం కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version