నేడు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా 108, అమ్మఒడి వాహనాల ప్రారంభం

-

నేడు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నెక్లెస్ రోడ్‌లో 108, అమ్మఒడి వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఇవ్వాళ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నెక్లెస్ రోడ్ లో 108, అమ్మఒడి వాహనాలు ప్రారంభం కానున్నాయి.

అనంతరం సభ కూడా ఏర్పాటు చేసిన వైద్యారోగ్య శాఖ…ఆ సభలో సిఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక ఇవాళ ఒకేసారి 466 అంబులెన్సు లు అందుబాటులోకి రానున్నాయి. అందులో 108 అంబులెన్స్ లు 204 వాహనాలు ఉన్నాయి. 102 అంబులెన్స్, అమ్మఒడి వాహనాలు 228 వాహనాలు ఉన్నాయి. 34 పార్ధివదేహ వాహనాలు ఉన్నాయి.

కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహారాష్ట్ర పర్యటన ఖరారు అయింది. BRS చీఫ్, సీఎం కేసీఆర్ మంగళవారం అంటే ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళనున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఏర్పాటు చేసే దళిత నేత అన్న బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version