బిగ్ బాస్ గీతు సంచలన కామెంట్స్..!!

-

బిగ్ బాస్ గేమ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కొట్టుకుంటే నే చూసే మనం ఇక సెలబ్రిటీలు కొట్టుకుంటూ ఉంటే ఉండగలమా. అదే బిగ్ బాస్ షో కు రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం. ఇక గత సీజన్స్ తో పోల్చితే  ఈ సీజన్ రేటింగ్స్ నీరసంగా ఉన్నాయి. అందుకే నాగార్జున కూడా గుడ్ బై చెబుతున్నాడు..

ఇక ఈ సీజన్లో తన తింగరి తనం తో జనాలను గెలికిన  వారిలో ముందు వరుసలో వుండేది గలాటా గీతు. షో కు వెళ్ళ బోయే ముందు అన్ని రకాల బిగ్ బాస్ షోలు చూసి స్ట్రాటజీ బట్టీ పట్టి వచ్చి ఇక తనదే కప్ అని ఓవర్ యాక్షన్ చేసింది. ఇది చూడలేక ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. అయిన తర్వాత  ఆమె వారం రోజులు బోరున ఏడ్చింది. బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ ఏడ్చిన ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.బిగ్ బాస్ తర్వాత డిప్రషన్ లో కి వెళ్లిందట.. అందుకే బయట కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ బయటకి వచ్చి నార్మల్ గా ఉంటోంది.

ఇక రీసెంట్ గా చిత్తూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గీతు మాట్లాడుతూ ప్ర‌జాసేవ చేయ‌డం కోసం త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పింది. అలాగే ప్ర‌జ‌లు ఆకాంక్ష‌ల‌కు త‌గ్గట్టుగా ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణ‌యించుకుంటాన‌న్నారు. ఇంకా ఫ‌లానా పార్టీలో చేరాల‌ని అనుకోలేద‌న్నారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇటీవ‌లే బ‌య‌టికొచ్చానన్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను  ప‌రిశీలిస్తున్న‌ట్టు గీతు చెప్పుకొచ్చింది. ఇక దీనిపై ప్రజలు,నెటిజన్స్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version