హీరోగా లాంచ్ అవబోతున్న ఆ బడా నిర్మాత కొడుకు ..!

-

టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ సినిమాలను నిర్మిస్తూ భారీ సక్సస్ లను అందుకుంటున్న నిర్మాత డీవీవీ దానయ్య. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఇప్పటికే దాదాపు 20 సినిమాలని నిర్మించారు. అంతేకాదు టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఫేమస్ అయ్యారు. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా … దానయ్య నిర్మాణం అంటే హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా డేట్స్ ఇచ్చే స్థాయికి వచ్చారు.

 

ప్రస్తుతం దానయ్య నిర్మాతగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతుంది. ఫిక్షన్ కథాంశం తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్.టి.ఆర్ కొమరం భీం గా శంక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా 70 శాతం పూర్తైంది.

ఒకవైపు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తూనే మరో వైపు తన కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు దానయ్య. తన కొడుకు కల్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమాని నిర్మించబోతున్నారు. లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం.. వంటి మాస్ ఎంటర్‌టనర్స్ ని తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించనున్నారు. ప్రస్తుతం పక్కాగా స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్న శ్రీవాస్ త్వరలో ప్రాజెక్ట్ కి సంబంధిన అధికారక ప్రకటన ని ఇవ్వనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version