వైరల్ అవుతున్న మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో .. ఈ గెటప్ ఆ సినిమా కోసమేనా ..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కుటుంబం తో కలిసి సరదాగా గడుపుతున్నారు. తన ముద్దుల కూతురు సితార, కొడుకు గౌతం లతో కలిసి నానా హంగామా చేస్తున్నారు. రోజుకో కొత్త ఫొటో నో లేక వీడొయోనో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. వీటికి ఫ్యాన్స్ అండ్ నెటిజన్ రక రకాల కామెంట్స్ పెడుతు తేగ సంబర పడుతున్నారు. ముఖ్యంగా సితార చేస్తున్న అల్లరి, డాన్స్, సాంగ్స్ పాడటం సూపర్ స్టార్ ఫ్యాన్ కి కను విందు కలిగిస్తోంది.

 

ఇక మహేష్ బాబు కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి కొడుకు కూతురు తో కలిసి చేసే అల్లరంతా మహేష్ శ్రీమతి నమ్రత కాప్చర్ చేసి టిట్టర్, ఇన్స్టాలో అప్ లోడ్ చేస్తున్నారు. అలా రీసెంట్ పిక్ ఒకటి అప్ లోడ్ చేయగా ప్రతీ ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ పిక్ లో కొడుకు కూతురుతో ఉన్న మహేష్ చాలా యంగ్ లుక్ లో కనిపించి షాకిచ్చాడు. ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు మహేష్ ని ఇంతక ముందెన్నడు చూడకపోవడంతో ఏంటి ఇది మహేష్ ..ఆ అంటూ అవాక్కైపోతున్నారు.

ప్రస్తుతం ఈ పిక్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ కొత్త లుక్ మహేష్ తాజా చిత్రం కోసం అన్న ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు త్వరలో గీత గోవిందం ఫేం పరశురాం తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు అయిన మే 31 న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఆ సినిమా కోసమే మహేష్ ఇలా కొత్త మేకోవర్ తో రెడీ అయ్యారని అంటున్నారు. మొత్తానికి మహేష్ కనిపిస్తున్న ఈ కొత్త లుక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version