ఇదిలా వుంటే నామినేషన్స్‌లో వున్న అభిజిత్ శనివారం సేఫ్ అయ్యాడు. అత్యధికంగా ఓట్లు పోలవ్వడంతో అభిజిత్ సేఫ్ అవుతూ వస్తున్నాడు. అంటే అతనికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీ స్థాయిలో వుండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అభిజిత్‌ని బిగ్ బాస్ విన్నర్‌గా నిలబెట్టేందుకు సోషల్ మీడియాలో ఓ టీమ్ యుద్ధమే చేస్తోంది.
దీనికి తోడు హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్ కూడా వెళుతూ వెళుతూ అభి బయట నీకు కుడి భుజంలా వుంటా అని చెప్పడం.. యాంకర్ రవి, బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పునర్నవి భూపాలం కూడా అభిజిత్‌కి సపోర్ట్‌గా నిలవడంతో అభిజిత్ ప్రతీ నామినేషన్ నుంచి ఈజీగా సేఫ్ అవుతూ వస్తున్నాడు. ఫైనల్ లోనూ అభి తన సత్తాను చాటుకుని బిగ్‌బాస్ విన్నర్‌గా అవతరిస్తాడని స్పష్టమవుతోంది. అభి టీమ్ ఇప్పటికే 41.6కె ట్వీట్స్ చేశారంటే ఏ స్థాయిలో సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.