బిగ్ బాస్: వారిద్దరూ రియలైజ్ అయ్యారా..?

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం కంటెస్టెంట్లు అందరూ పోటాపోటీగా పోటీపడి షోని ఆసక్తికరంగా మలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసారు. కానీ ఆ టాస్కులో కొందరు కంటెస్టెంట్లు తమ సంయమనాన్ని కోల్పోయారు. రోబోల టీమ్ దివిని కిడ్నాప్ చేసిన తర్వాత మెహబూబ్, సోహైల్, అఖిల్ పిచ్చి పిచ్చిగా అరిచారు. నోయల్ మొదట్లో అరిచినంత పనిచేసినా ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించాడు. అఖిల్ కూడా కాస్త శాంతించాడు.

కానీ మెహబూబ్, సోహైల్ మాత్రం విపరీతంగా గోల చేసారు. అనవసరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో, సైగలతో అరిచారు. ఇదంతా ప్రేక్షకులు బాగా గమనించారు. టాస్క్ పూర్తయ్యాక మరుసటీ రోజు మెహబూబ్, సోహైల్ కలుసుకుని తాము చేసిన రచ్చని గుర్తు చేసుకున్నారు. శుక్రవారం ఎపిసోడ్ లో వారిద్దరు మాట్లాడుకుంటూ అసలు టాస్క్ పెద్ద ఇంపార్టెన్సే కాదు. మనమే అనవసరంగా పిచ్చోళ్ళం అయిపోయాం అంటూ మాట్లాడుకోసాగారు. మొత్తానికి తాము చేసిన రచ్చకి తామే బలవుతున్నామేమో అని గుర్తొచ్చినట్టుంది. మరి ఇకనుండైనా సరైన ఆట ఆడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version