బిగ్ బాస్ ఫైనల్ లో రచ్చ చేయడానికి ఆ హీరోయిన్లు రెడీ..

-

బిగ్ బాస్ షో ఫైనల్ కి చేరుతున్న సమయంలో అందర్లోనూ అసక్తి నెలకొన్న ఏకైక అంశం, ఫైనల్ కి అతిధిగా ఎవరొస్తున్నారనే. ప్రస్తుతానికి ఈ విషయంలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తారక్ లేదా మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వస్తారని భావిస్తున్నారు. అదలా ఉంటే, ఫైనల్ ఎపిసోడ్‌లో ఎవరెవరు పర్ ఫార్మ్ చేస్తున్నారనే విషయమై తాజా అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ల టీఆర్పీ రికార్డులని బద్దలు కొట్టాలన్న ఉద్దేశంతో చాలా గ్రాండ్ గా చేస్తున్నారట.

నాలుగు గంటల పాటు సాగే ఈ ఎపిసోడ్‌లో టాలీవుడ్ హీరోయిన్లు మెహ్రీన్ ఫిర్జాదా, లక్ష్మీ రాయ్ చిందులు వేయనున్నారట. ప్రత్యేక పెర్ఫార్మెన్స్ తో ఎంటర్ టైన్ చేయనున్నారట. ఐతే వీరితో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు బిగ్ బాస్ స్టేజిపై ఆడిపాడనున్నారట. మరి వీటన్నింటితో బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్న టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version