బిగ్ బాస్ సీజన్ 9 కి ముహూర్తం ఖరారు అయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ చేయబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తారని దానిపైన చర్చ జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే టాలీవుడ్ కమెడియన్లు ఇమాన్యుల్, నటుడు సాయికిరణ్, ముఖేష్ గౌడ, సుమంత్ అశ్విన్ దేబ్జాని, శివకుమార్, తేజస్విని, నవ్య స్వామి అలాగే రీతు చౌదరి లాంటివారు రాబోతున్నట్లు తెలుస్తోంది.