బిగ్‌బాస్ హౌస్‌లో సంతాప‌స‌భ.. ఎవ‌రిదో తెలిస్తే షాక్‌..!

బిగ్ బాస్ హౌస్‌లో నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగు పెట్టిన ఇంటి స‌భ్యుల‌ మ‌ధ్య‌ ఆట రంజుగా మారింది. ఇక శ‌నివారం కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరావడంతో బిగ్ బాస్ హౌస్‌ను మన టీవీ ద్వారా అక్కడ జరిగే ఆసక్తికర పరిణామాలను నాగార్జున చూపించాడు. అయితే శ‌క్రువారం నైట్ రాహుల్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ త‌ర్వాత‌ కొంద‌రు వాట‌ర్‌తో అడుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలోనే వాట‌ర్ వేస్టింగ్ కారణంగా బిగ్‌బాస్ హౌస్‌కి వాటర్‌ను ఆపేశారు.

దీంతో శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, రాహుల్‌లు బిగ్ బాస్‌కు గుంజీలు తీసి క్షమాపణలు చేప్ప‌డంతో వాట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో గ్రూప్‌గా ఉన్న పునర్నవి, రాహుల్, వితికా, వరుణ్ మధ్య పుల్ల పెట్టారు బిగ్ బాస్. దీంతో వితికా, పునర్నవిల మ‌ధ్య‌ సీరియస్ చర్చ న‌డుస్తూనే ఉంది. ఇదంతా ఇలా ఉంటే శ్రీముఖి దోమల మందు కొట్టడంతో బిగ్ బాస్ హౌస్‌లో ఈగ చనిపోయింది. అది చూసిన బాబా భాస్క‌ర్ ప్రెగ్నెంట్‌తో ఉన్న ఈగ‌ను చంపావు. ఈ పాపం ఊరికే పోదు అంటూ వీర లెవ‌ల్లో  పెర్ఫామెన్స్ చేశాడు.


దీంతో శ్రీ‌ముఖి చ‌నిపోయిన ఈగ కోసం ప్రేయ‌ర్ చేస్తాన‌ని ‘ఈగ ఓ మంచి ఈగ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ కామెడీ చేసింది. ఇక ఈ ఇద్దరి పెర్ఫామెన్స్‌కు తోడైన మిగిలిన ఇంటి స‌భ్యులు ఈగ మరణానికి సంతాప‌స‌భ‌ అంటూ గోల చేస్తూ ఓ రేంజ్‌లో ఓవరాక్షన్ చేశారు. ఇక దీని ముందు నుంచి చ‌ర్చ‌లు సాగుతున్న వితిక, పున‌ర్న‌విల మ‌ధ్య చివ‌రిగా గొడవకు పుల్ స్టాప్ పెట్టింది వితికా.

ఇక ఈవారం ఎలిమినేషన్‌లో ఏడుగురు రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌లు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఇద్దర్ని.. శివజ్యోతి, మహేష్ విట్టాలను నాగార్జున సేఫ్ చేశారు. ఇక మిగిలిన వారిలో ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో ?  ఆదివారం తేలిపోనుంది.