ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే సంపద పెరుగుతుంది.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!

-

వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటిస్తే జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. చాలా శాతం మంది జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి బయట పడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆర్థికంగా ఎటువంటి సమస్య ఎదురవ్వదు. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పినటువంటి నియమాలను తప్పకుండా పాటించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇంటి ముఖ ద్వారం దగ్గరలో షూ మరియు చెప్పులని ఉంచకూడదు. చెప్పులని ముఖద్వారం దగ్గర వదిలిపెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మంచం పై మాసిన లేక చిరిగిపోయిన బెడ్ షీట్ లను అస్సలు వేయకూడదు. వీటివలన ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. కనుక సానుకూల శక్తిని పొందాలంటే ఎప్పటికప్పుడు మంచాన్ని శుభ్రంగా ఉంచాలి మరియు దుప్పట్లను కూడా మారుస్తూ ఉండాలి. మహిళలు సాధారణంగా రాత్రి వంట చేసిన తర్వాత పాత్రలను శుభ్రం చేయకుండా పడుకుంటారు. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

అంతేకాకుండా రాహు మరియు కేతువుల నుండి చెడు ఫలితాలు కూడా వస్తాయి. కనుక రాత్రిపూట వండుకున్న పాత్రలను తప్పకుండా శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే తప్పకుండా పూజ గదిని శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా పూజ గదిలో శుభ్రత లేకపోతే మానసిక సమస్యలుతో పాటుగా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. కనుక పూజ గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దీంతో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆహారాన్ని తినేసిన తర్వాత కంచంలో చేతులను అస్సలు కడగకూడదు. దీని వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇటువంటివి పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news