తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్! ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్.. ప్రస్తుతం సీజన్ 5 లోకి ఎంటరైంది! ఈ షోకి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బెల్ట్ కూడా ఉంది. ఆ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షక లోకం ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే… నారాయాణ లాంటి మేధావులు.. తమ తెలివితేటలను, పోరాట పటిమను.. ప్రజాసమస్యలపై పెడితే బాగుంటుందనే కామెంట్లు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిపై కంటే అధికంగా ఒక టీవీ షోపై స్పందించడం ఏమాత్రం సహేతుకం కాదనే కామెంట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా… వ్యక్తి ఇష్టాఇష్టాలను బట్టి వ్యవస్థలు నడుచుకోవనే విషయం నారాయణ గ్రహించాలనేది మరికొందరి సూచనగా ఉంది!
నిజానికి బిగ్ బాస్ షో ప్యూర్‌గా బిజినెస్ కోసం నడిపిస్తున్న షో.. ఈ షో ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. 24 ఫ్రేమ్స్ వర్క్ చేస్తాయి.. వందల మందికి ఉపాధి దొరకుతుంది షో నచ్చకపోతే చూడొద్దు, షో వల్ల నష్టం జరుగుతుందనుకుంటే ఫిర్యాదు చేయవచ్చంటూ షోను సమర్థించే వాళ్లు చెబుతున్నారు. మరో కోణంలో చూస్తే బిగ్ బాస్ షో వల్లే సమాజం చెడిపోతుందా..?? ఈ షో లేనప్పుడు ఒక్క తప్పుకూడా జరగలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే లెక్కకు మిక్కిలి ఛానల్స్ వస్తున్నాయి. అందులో అన్నీ చూస్తున్నారా..? అలాగే బిగ్ బాస్ చూడకండంటూ సలహా ఇస్తున్నారు.
సో.. మంచి చెడు రెండు వస్తున్న టీవీలో ఎవరికి నచ్చింది వారు చూస్తున్నారు.. నారాయణతో సహా..
బిగ్ బాస్ గేమ్ గురించి తెలియని వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారనే కామెంట్ల నడుమ… బిగ్ బాస్ వల్ల సమాజంలో ఎలాంటి దుర్మార్గం జరగడం లేదు అనే విషయం సోకాల్డ్ నాయకులు ఆలోచించాలనేది నెటిజన్ల స్పందనగా ఉంది! మరి ఈ కామెంట్లపై పెద్దలు ఆలోచిస్తారా లేక ఈ రంకెలు కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి!