బిగ్ బాస్ 7: సీజన్ 7 లోకి యాంకర్ రష్మీ..!

-

అందాల ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె బుల్లితెర పై వచ్చే కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెర షోలలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు బిజీగా ఉంటూనే.. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ.. ఎప్పటికప్పుడు మరింత వైరల్ గా మారుతూ ఉంటుంది.

తాజాగా రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈమెకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందని అయితే రెమ్యునరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈసారి సీజన్ సెవెన్ కి హోస్టుగా రానా వస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరొకవైపు బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఎవరు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

తాజాగా సోషల్ మీడియాలో ఇలా రాసుకుంటూ మాంసాహారులపై ఇంట్రెస్ట్ కామెంట్ చేసింది. మత కొన్ని సంవత్సరాలుగా మూగజీవాల సంరక్షణ కోసం ఈమె పాట పడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వీలున్నప్పుడల్లా కూడా ట్వీట్ చేస్తూ ఉంటుంది.. “పెరిగేవి తినండి కానీ పుట్టేవి కాదు” అంటూ ఒక పోస్ట్ చేసింది. దీనికి పలువురు నెటిజెన్లు రెస్పాండ్ అవుతూ సూపర్ రష్మీ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version