కంప్యూటర్ వలన కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయా..? అయితే బెస్ట్ టిప్స్ మీకోసం..!

-

సెలబ్రేట్ చేసుకోవడానికి అంటూ ఒక రోజైనా ప్రత్యేకం గా ఉండాలి. ఎందుకంటే హడావుడిగా, మనకోసం, మనవాళ్ళ కోసం క్షణం కేటాయించని ఈ కాలంలో కనీసం ఇలాంటి ఒక రోజుని మన వాళ్ళందరితో గడపడానికి ఏర్పడినవే ఇలాంటి స్పెషల్ డేస్. కనీసం ఆ రోజైనా ఏ బిజీ లేకుండా హాయిగా మన కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆనందంగా గడిపేందుకు వీలుంటుందని వీటిని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అంతరార్థం.వాటిలో ఒకటి ఈ రోజు ఫిబ్రవరి 11 ప్రామిస్ డే. మీరు మీ భాగస్వామి కి లేదా మీ స్నేహితులకు, మరియు కుటుంబ సభ్యులకు, అంతే కాకుండా ప్రేమికులు ఒకరికి ఒకరు వాగ్దానం చేసుకునే రోజు. వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజును ప్రామిస్ డేగా జరుపుకుంటారు. ప్రామిస్ లేదా వాగ్దానం అనేది ఇద్దరి మధ్య చాలా ముఖ్యమయినది. అది వారిరువురి మధ్య బంధాన్ని మరింత బలంగా ముందుకు నడిపించడానికి సహాయపడుతుంది.

 

వాగ్దానం అనేది నమ్మకాన్ని సూచిస్తుంది. అది ఒక పనిని చేస్తాను అని చెప్పేందుకు అయి ఉండొచ్చు, ఒక వేళ మనం వాగ్దానం చేసే వారికి నచ్చని పనిని ఇకపై ఇది చెయ్యను అని మాట ఇచ్చేందుకు. అయి ఉండొచ్చు. ఒక సారి మాట ఇచ్చిన తర్వాత మన వాళ్లకు ఆ విషయం పట్ల ఒక బలమైన నమ్మకం ఏర్పరచిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఏ సందర్భంలో అయిన మనం ఇచ్చిన మాట,

చేసిన వాగ్దానం గుర్తువచ్చి మనల్ని మాట మీద నిలబడేటట్టు చేయడం ద్వారా మన బంధానికి, నమ్మకానికి మరింత బలం చేకూరుస్తుంది. ఈ ప్రామిస్ డే 2020 ను మీ ప్రియమైనవారితో నిజమైన వాగ్దానం చేయడం ద్వారా గొప్పగా సెలబ్రేట్ చేయండి. మీ బంధం పట్ల మీవాళ్లకు మరింత విశ్వసనీయతను కలిగించండి. మీరు చేసే వాగ్దానం మీతో ముడిపడి ఉన్న బంధాలను ఎన్నటికీ విడదీయలేని అనుబంధం గా మార్చుతుంది. ఎందుకంటే ఇది వాగ్దానానికి ఉన్న విశిష్ట లక్షణం.

Read more RELATED
Recommended to you

Exit mobile version