బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయింది వీరే..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఎపిసోడ్ సందర్భంగా ప్రేక్షకుల ఆదరణ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు రావడంతో అంతా ఎమోషనల్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ వారానికి సంబంధించిన తాజా అప్డేట్ చూస్తే ఇనయ సుల్తానా అదృష్టం మారిపోయిందని చెప్పాలి. సీజన్ మొత్తం కెప్టెన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు, పోరాటాలు చేసినా కెప్టెన్ పదవిని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈసారి కెప్టెన్ అయ్యే వారికి ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు.. అదేమిటంటే ఈవారం ఎవరైతే కెప్టెన్ అవుతారో వారు నేరుగా సెమీఫైనల్ వీక్ కి వెళ్ళిపోతారు .. అంటే.. ఫైనల్ కి ఒక్క అడుగు దూరం మాత్రమే అన్నమాట.. ఇప్పుడు సుల్తానా అడుగు దూరానికి వెళ్లిపోయింది.. మొత్తానికి లాస్ట్ వీక్ కెప్టెన్ గా ఇనయా సుల్తానా గెలిచింది.

మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంతా ఎదురు చూడగా షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ముఖ్యంగా రోహిత్ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి రోహిత్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్.. భార్యాభర్తలిద్దరూ నామినేషన్ లో ఉన్నా కూడా రోహిత్ కు మంచి ఓట్లు పడేవి. అయితే ఇప్పుడు అతని భార్య మెరీనా కూడా గతవారం ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ఆమె అభిమానులు కూడా ప్రస్తుతం రోహిత్ కే ఓట్లు వేస్తున్నారు. కానీ రోహిత్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనే వార్త ప్రేక్షకులను అలాగే అభిమానులను మరింత కలవరపెడుతోంది.

నిజానికి మొదటి నుంచి రోహిత్ కి బయట పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా అతని గేమ్ త్యాగాలతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అలాంటిది ఇప్పుడు రోహిత్ ఎలిమినేట్ అవ్వడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిజానికి రోహిత్ ఎలిమినేట్ కావాల్సింది కాదు.. వేరే వాళ్ళ గ్రాఫ్ మారడం వల్ల రోహిత్ ఎలిమినేట్ కాక తప్పడం లేదంటూ సమాచారం. నిజానికి లీస్ట్ పొజిషన్లో శ్రీ సత్య ఉంది. అయితే ఫ్యామిలీ వీక్ ద్వారా ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె తల్లిదండ్రులను వారి కష్టాలను చూసి ప్రేక్షకులు కరిగిపోయి.. శ్రీ సత్య కి ఓట్లు వేశారు. అందుకే రోహిత్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news