బిగ్ బాస్: ఆర్ జే సూర్య ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం ఇదే..!

-

బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేషన్ లో కంటెస్టెంట్లకు ఊహించని షాక్ తగిలింది. ఎట్టకేలకు బిగ్ బాస్ 8వ సీజన్ నుంచి ఆర్ జే సూర్య బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా అమ్మాయిలతో పులిహోర కలిపాడు. సరిగ్గా దృష్టి పెట్టి ఆడి ఉంటే టాప్ ఫైవ్ లో ఒకడిగా ఉండేవాడు.. కానీ ఆటపై కంటే అమ్మాయిలపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల బిగ్ బాస్ ఆర్ జే సూర్య పై దృష్టి పెట్టి బయటకు పంపించేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది..

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అందులో కొందరు మినహా మిగతా ఎవరూ కూడా వ్యూవర్స్ కి పెద్దగా తెలియదు. సింగర్ రేవంత్ ,బాలాదిత్య , ఫైమా, చంటి , గీతూ తో పాటు ఆర్జె సూర్య మాత్రమే ప్రేక్షకులకు తెలిసినవాళ్లు. ఇక ఆర్జె సూర్య మిమిక్రీ చేయడంలో సూపర్ టాలెంటెడ్.. కానీ తనలోని ఆ విలక్షణ నటుడిని చూపించి ఉంటే కచ్చితంగా ఫైనల్ కి వెళ్లేవాడు.. అది జరగకపోగా ఆరోహి తో మొన్నటి వరకు పులిహోర కలిపిన ఈయన.. ఇప్పుడు ఇనయాతో పులిహోర కలుపుతూ టైం వేస్ట్ చేశాడు. దీంతో బిగ్ బాస్ ఆర్ జె సూర్యను ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.

మొదట్లో బాగా ఆడి మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఫెమినిస్ట్ అని చెప్పి కొన్నిసార్లు ఆడవాళ్లకు సపోర్టు కూడా చేశాడు. ఆ తర్వాత ఆరోహీ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. ఇక వీరి జంటను తట్టుకోలేక ఆరోహిని ప్రేక్షకులు ఎలిమినేట్ చేసి పంపేశారు. ఆమె వెళ్లిపోవడంతో సూర్య – ఇనయాతో బాండింగ్ ఏర్పరచుకున్నాడు. దీంతో సూర్య పెర్ఫార్మెన్స్ తగ్గుతూ వచ్చింది. మొత్తంగా మంచి పేరుతో హౌస్ లో అడుగుపెట్టిన ఈయన అదంతా పోగొట్టుకొని ఎలిమినేట్ అయ్యాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version