Bigg Boss Promo 2 : గంగవ్వ దెబ్బకి కంటెస్టెంట్లకు వణుకు..!

-

బిగ్ బాస్ లో కాస్త ఎంటర్టైన్ మెంట్ తక్కువ అయిందని వైల్డ్ కార్డు ఎంట్రీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ అయితే ఇప్పటివరకు బాగానే నవ్వించారు. ఇవాల్టి ప్రోమో 1లో అవినాష్ జిమ్ ట్రైనర్ గా మారి ఇంటి సభ్యులు వర్కౌట్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక ప్రోమో 2 మాత్రం గంగవ్వ ఇరగదీసిందనే చెప్పాలి. అర్థరాత్రి అందరూ నిద్రపోయాక.. జుట్టూ వీరబోసుకొని దెయ్యం పట్టినట్టు ఓ ఓ అంటూ గట్టిగా అరించింది గంగవ్వ. ఇది చూసి అవినాష్, టేస్టీతేజ, యష్మీ సహా ఒక్కొక్కరూ బయటికొచ్చి చూశారు.

అవినాష్ కాస్త ధైర్యం చేసి వెళ్లి పట్టుకునే సరికి గంగవ్వ చేయి విసిరి కొట్టింది. దీంతో చుట్టూ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. రోహిణి పట్టుకునేందుకు వెళ్లగా గంగవ్వ అరుపులకు జడుసుకుంది. అలాగే నయని పావని స్టోర్ రూమ్ కెమెరా దగ్గరికి వెళ్లి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి అంటూ గోల చేసింది. మొత్తానికి గంగవ్వను అలా లేపి బెడ్ మీదకు తీసుకెళ్లి పడుకోబెట్టారు తేజ, అవినాష్. ఇక లేడీ గ్యాంగ్ మాత్రం ఇదంతా చూసి అమ్మో.. ఎలా పడుకోవాలబ్బా.. నాకు కాళ్లు, చేతులు వణుకుతున్నాయి అంటూ రోహిణి, హరితేజ భయపడ్డారు. ప్రోమోలో కొద్ది సేపటికీ ఈ ప్రాంక్ ను ఎవ్వరూ ప్లాన్ చేశారో చూపించాడు బిగ్ బాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version