నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాం పథకం దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం పొడగించింది. ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పథకం అమలు తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరిలుగా విభజించింది. కేటగిరి 1 కింద రూ.1లక్ష వరకు రుణం అందిస్తుంది. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది. అందులో 70 శాతం రాయితీ కల్పిస్తుంది. కేటగిరి 3 కింద రూ.2లక్షల నుంచి రూ.3లక్షల లోపు రుణాలను అందజేయనుండగా.. అందులో 60 శాతం రాయితీ లభిస్తుంది.