క్షమించు ఇర్ఫాన్… నీ అనారోగ్యం గురించి నవ్వుకున్నా…

-

ఇర్ఫాన్ ఖాన్… నీ సినిమాలు నేను చూడలేదు, ఎప్పుడో నాకు సినిమా అంటే సరిగా తెలియని సమయంలో వచ్చిన సైనికుడు సినిమా సమయంలో నీ మొహం చూసాను. హీరోలను గ్లామర్ గా చూసే నేను నిన్ను అవమానించాను అనుకుంట.ఇలా ఉన్నాడు ఏంటి రా బాబు అనుకున్నాను. నాకు ఊహ సరిగా తెలిసి సినిమా గురించి తెలిసిన సమయంలో నాకు నీ నటన చాలా నచ్చింది.

అది నీ నటనలోని విలక్షణత అని తెలిసింది, మీ హిందిలో నువ్వు మంచి నటుడువి అని తర్వాత తెలిసింది. 2017 లో నేను ఒక వెబ్‌సైట్‌కి నీ గురించి రాసినప్పుడు, నువ్వు లండన్ లో ఉండి చికిత్స తీసుకుని నీ ప్రాణాల మీదకు వచ్చింది అని చెప్పావ్. నీ చావు గురించి ఏదో మాట్లాడావ్. నిజంగా క్షమించు ఇర్ఫాన్. నీ చావు నిజంగానే నీ దగ్గరకు వచ్చింది అని ఈ రోజు తెలిసింది. క్షమించు నన్ను.

ఏదో సానుభూతి కోసం మాట్లాడావ్ అనుకున్నాను… నిజంగా క్షమించు.ఎప్పుడూ ఎవరి గురించి అలా ఊహించను, అనుకోను. నీ చావు నిజం అని నేను ఇంకా నమ్మడం లేదు. పప్పూ యాదవ్ గా నువ్వు నటించిన సినిమా ఫ్లాప్ అయినా సరే నేను ఎప్పటికి మర్చిపోలేను. నీ కోసం నీ సినిమాలు అన్నీ ఒక్కొక్కటిగా చూస్తాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ… మళ్ళీ జన్మ ఉంటే నూరేళ్ళు బ్రతకాలని ఆకాంక్షిస్తున్నా…

Read more RELATED
Recommended to you

Exit mobile version