సలార్ మేనియా.. దెబ్బకు Book My Show సర్వర్ క్రాష్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన మూవీ సలార్. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 22న విడుదలయ్యే ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ షురూ అయింది. మంగళవారం రాత్రి 8.24 గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం.. తెలంగాణ, ఏపీ జనాలు బుక్ మై షో యాప్ మీద పడ్డారు.

సలార్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఒక్కసారిగా లక్షలాది మంది యాప్ ఓపెన్ చేయడంతో బుక్ మై షో సర్వర్ క్రాష్ అయింది. కాసేపటి దాకా యాప్ పని చేయలేదు. బుక్ మై షో క్రాష్ అయిన ఫొటోలు స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాసేపటికి యాప్ నిర్వాహకులు సమస్యను పరిష్కరించారు. యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version