టెన్షన్..టెన్షన్..40 మంది బౌన్సర్లతో విష్ణు..30 మందితో మనోజ్ ఫైటింగ్ కు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మంచు ఫ్యామిలీ గొడవ క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే.. జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా చేరుకుంటున్నారు బౌన్సర్లు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారట.
అటు పోటీగా 30 మంది బౌన్సర్లను తెప్పించాడు మంచు మనోజ్. హీరో మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి అనుమతించడం లేదట సెక్యూరిటీ. ఇక అటు కాసేపట్లో దుబాయ్ నుంచి రానున్నారు మంచు విష్ణు. హీరో విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ముంబై నుంచి వచ్చిన మంచు లక్ష్మి..ఈ గొడవపై ఆరా తీస్తున్నారు. కాగా ఇప్పటికే మోహన్ బాబుపై హీరో మంచు మనోజ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.