The girlfriend teaser: వరుస సినిమాలతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న దూసుకుపోతోంది. తాజాగా “పుష్ప ది రూల్” సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలో “ది గర్ల్ ఫ్రెండ్” అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, మారుతి నిర్మాణంలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.
కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వైవిద్యమైన ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్. విజయ్ దేవరకొండ కవితతో ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.