అఖండ సీక్వెల్ కోసం సర్వం సిద్ధం చేసిన బోయపాటి.. ఎప్పుడంటే..?

-

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన చిత్రం అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి మంచి ప్రేక్షకాదరణ పొందాడు. అంతేకాదు ఈ సినిమా విజయం సాధించడమే కాదు విదేశాలలో కూడా తెలుగు సినిమా రికార్డులు సృష్టించడం గమనార్హం. ఈ సినిమా విజయంతో బాలయ్య బాబు, బోయపాటి మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను అందించిన బోయపాటికి బాలయ్య మరొక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా భారీ సక్సెస్ ఇచ్చిన అఖండ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో వీరిద్దరూ ఉన్నట్లు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఈ క్రమంలోనే తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది. ఇకపోతే బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా సంచలన విజయంతో టీమ్ మొత్తానికి కొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు. బాలయ్య సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా అఖండ సినిమా చెరగని ముద్ర వేసుకుంది. ఇక పెద్ద వాళ్లతో పాటు పిల్లలను కూడా అఖండ అదే స్థాయిలో ఆకట్టుకోవడం గమనార్హం. ఇక ఈ గొప్ప సినిమాకు సీక్వెల్ ఉందంటూ బోయపాటి గతంలోనే మాట ఇచ్చినప్పటికీ దీనిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పై బోయపాటి రైటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం.అఘోరా తో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్న పాప చుట్టూ సెకండ్ పార్ట్ ఉంటుందట ముఖ్యంగా ఈ చిన్న పాప టీనేజ్ లోకి అడుగు పెట్టడం ఆమెకి ఇచ్చిన మాట కోసం మళ్లీ రావడం తో మొదలవుతుంది అని చెబుతున్నారు. బాలకృష్ణ గోపీచంద్ మలినేని , అనిల్ రావిపూడి తో సినిమాలు అయిన తర్వాత అక్కడ నుంచి సీక్వెల్ మొదలు కాబోతుంది అని సమాచారం దీంతో బాలయ్య అభిమానులు పూర్తిస్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version