ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త కొత్త స్టైల్ లో హత్యలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లభించకూడదని సరికొత్తగా ఆలోచించి పథకం పన్నుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య వెంకట మాధవిని అనుమానంతో దారుణంగా చంపేశాడు భర్త గురుమూర్తి. చంపిన తరువాత భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు.
ఆ తరువాత ఉడుకబెట్టి.. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ఉడుకబెట్టాడు. ఉడుకపెట్టిన ముక్కలను ఎండబెట్టి.. రోకలితో ముక్కలను పొడి చేశాడు. ఆ తరువాత ఆ పొడిని చెరువులో పడేశాడు. దీంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీ. వెంకట మాధవి పై అనుమానం పెంచుకొని ఈ పని చేశాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు మూడు రోజుల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చాడు.